కొత్త కోట రావికమతం లో ఘనంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం: గంజాయి రహిత సమాజమే లక్ష్యం*సి ఐ కోటేశ్వరరావు

జనం న్యూస్ జూన్ 27, రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, గంజాయి రహిత సమాజనిర్మాణానికిభాగస్వాములు కావాలని కొత్తకోట సర్కిల్ సీఐ శ్రీ కోటేశ్వర రావు పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తకోట సర్కిల్ సీఐ శ్రీ కోటేశ్వర రావు మరియు కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్లఆధ్వర్యంలో ‘నషాముక్త్భారత్అభియాన్’ (వ్యసన ముక్త భారత్ ప్రచారం) కార్యక్రమాన్ని కొత్త కోట రావిక మతంలో ఎస్సై రఘువర్మ ఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ కోటేశ్వర రావుమాట్లాడుతూ.. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను ఆయన ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. సమాజంలో మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ గారు అక్కడికి విచ్చేసిన విద్యార్థులు, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజల చేత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.ఈఅవగాహన కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *