జనం న్యూస్ 2జులై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ : పవర్‌గూడా గ్రామపంచాయతీకి చెందిన మేశ్రం కళాబాయి (భర్త: జ్ఞానేశ్వర్) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర విషయం తెలుసుకున్న పవర్‌గూడా గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ వెంటనే మృతురాలి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని సర్పంచ్ భరోసా ఇచ్చారు. సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు గ్రామస్తులు కూడా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.