జనం న్యూస్ 29 జూన్ 2026 మండలం నిజామాబాద్ జిల్లా ఆదివారం నాడు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి రుద్రూర్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో మండలం నుండి పెద్ద ఎత్తున గులాబీ దండు తరలి వెళ్లారు.ఈ సందర్భంగ గాండ్ల మధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తి వచ్చారు.బంగారు తెలంగాణ కెసిఆర్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని బిఆర్ఎస్ పార్టీకి బలం బలగం ప్రజలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డౌర్ సాయిలు,సిరిగాది శేఖర్, కొత్తపల్లి రవి కిరణ్, అల్లావుద్దీన్, శ్రావణ్, చాంద్ బాషా, సంతోష్ పటేల్ తదితరులు ఉన్నారు.