మే 20 తారీకు లోపు మత్స్యకారులు ఎన్ ఎఫ్ డి పి నమోదు చేయకపోతే

*ప్రమాద బీమా ఇన్సూరెన్స్ వర్తించబోదు అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక *సొసైటీ చైర్మన్ వాకిటీ ఆంజనేయులు

జనం న్యూస్ మే 3 కొల్లాపూర్, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్యకారులకు తెలియ జేయునది ఏమనగా మే 20 తారీకు లోగా మత్స్య సహకార సంఘాలలో సభ్యత్వం పొందిన వారు ఎన్ ఎఫ్ డి పి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారికి జి ఏ ఐ ఎస్ (గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్) వర్తించ దని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది కావున మీరందరూ మీ సంఘంలోని సభ్యత్వం పొందిన మత్స్యకారులు ఎన్ ఎఫ్ డి పి పోర్టల్ లో మే 20 లోగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించగలరు. లేనిచో ఎన్ ఎఫ్ డి పి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చెయ్యని యెడల వారికి ఇన్సూరెన్స్ స్కీం వర్తించదు. కావున ఇది అతి ప్రాముఖ్యమైన అంశముగా భావించి మే 20 లోగా అందరూ మత్స్యకారులు అందరూ కూడా ఎన్ ఎఫ్ డి పి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించగలరని డిస్టిక్ ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ వాకిటీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *