మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

జనం న్యూస్ మే 2, (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారి సేవలు అమూల్యమని, పట్టణ ప్రజల ఆరోగ్యానికి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులకు శాలువాలతో సత్కరించారు. నిత్యం కష్టపడి పని చేసే ఈ కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజం వారిని మరింత గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులు ఎప్పుడు వారి వెంట ఉంటామని వారి హక్కులకు భంగం కలిగినప్పుడు ముందు వరుసలో ఉండీ వారి కోసం న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మట్టేరి రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్ న్యాయవాది రాజురా సత్యంన్యాయవాదులు బక్కశెట్టి కిషోర్,వెంకట్ మహేంద్ర వినయ్,షబ్బీర్ పాష,షేఖ్ ఖదీర్,రసమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *