కీసర మండలంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జనము న్యూస్ మే 2:- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నియోజకవర్గంలోని కీసర మండలంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి , కాప్రా తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు, జిల్లా అధికార ప్రతినిధి, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని,అలాగే అత్యవసర పరిస్థితుల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, నాయకులు రాజు యాదవ్, సాయి కృష్ణ, మధు తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *