రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

*మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నూతన కమిటీ

జనం న్యూస్ మే 02 కోటబొమ్మాళి మండలం :రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు శనివారం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జిల్లా నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ఘనంగా మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు రావలసిన పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని, దినసరి విధుల్లో ఉన్నతా ధికారుల నుండి ఎదురవుతున్న పని ఒత్తిడిని తగ్గించే దిశగా తగిన చర్యలు చేపట్టాలి.రెవెన్యూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సానుకూల చొరవ చూపాలని విన్న వించారు,రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయడం జరుగుతందని మంత్రి తెలిపారు, జిల్లా అధ్యక్షులు బి.వి.వి.ఎన్. రాజు, సహాధ్యక్షులు ఎస్. గణపతి రావు, కార్యదర్శి డి. సోనీకిరణ్, కోశాధికారి మురళీధర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ బి. గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.కె. శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రాధిక, ఈసీ సభ్యులు కె. శరత్ బాబు, సి.హెచ్. దామోదర్ రావు. ఏపీజేఏసీ శ్రీకాకుళం జిల్లా ఉమెన్ వింగ్ చైర్మన్, కలెక్టరేట్ అధ్యక్షులు కె. ప్రవల్లిక ప్రియ, సెక్రటరీ పి. పద్మావతి, టెక్కలి డివిజన్ అధ్యక్షులు బి. హేమసుందర్, రెయ్యి రామారావు. తదిత తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *