బిజినపల్లిలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి*

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 02 ప్రతినిది ఎండీ జహంగీ బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో కోట్లాది మందికి వెలుగు నింపారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మిద్దె రాములు, డైరెక్టర్లు వాల్య నాయక్, నజీర్, సీనియర్ నాయకులు గంగనామోని తిరుపతయ్య, ఈశ్వర్, కేటి తిరుపతయ్య, గోవిందు నాయక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ బాలపిరు యాదవ్, సర్పంచ్లు ల్ జాలం నాగయ్య యాదవ్ ఇందిరా రాములు, కృష్ణ నాయక్, మారేపల్లి చంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ పరశురాములు, అమృత్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్లు గడ్డమీద మహేష్, కదిరే రాములు, నాయకులు ఊరేంకి బాలమోసయ్య, నగరాల పర్వతాలు యాదవ్, గడ్డమీది చిన్న మల్లయ్య, చీర్ణం చిన్న మల్లయ్య, అమర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *