గోరంట్లలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

-బాలికల హాస్టల్‌లో కేక్ కట్ చేసిన కూటమి నాయకులు
🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 02 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)గోరంట్ల: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గోరంట్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాలికల హాస్టల్‌లో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బాలకృష్ణ చౌదరి, హస్తకళల స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్, సిక్స్‌మ్యాన్ కమిటీ సభ్యులు నిమ్మల శ్రీధర్, గిరి, వేణు, అజమతుల్లా, మండల నాయకులు ఉత్తమ రెడ్డి, అచ్యుత్ చౌదరి, రవి నాయక్, నాగరాజు, శ్రీకాంత్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మేదర్ శ్రీనివాసులు, శంకర, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి శ్రీ వెంకటేష్, మండల అధ్యక్షులు సంతోష్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు పొగతోట వెంకటేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు శ్రీనివాసులు, గోవిందప్ప, బాలు, సింగిరెడ్డిపల్లి రమేష్, రాజుల రమేష్, సాయి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *