జనసేనాని బర్తడే సందర్బంగా రోగులకు పండ్లు పంపీణీ చేసినజనసేన నాయకుడు రేగుమహేష్

🖨️ Print

జనం న్యూస్, మన్యం జిల్లా,సాలూరు. సెప్టెంబర్ 3. సినీ రంగంలో ప్రేక్షకుల హృదయాల్లో పవర్ స్టార్ గా నిలిచి, జన హృదయాలలో జనసేనానిగా పేరుపొంది, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచి నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున సాలూరు పట్టణ జనసేన నాయకుడు రేగు మహేష్ మరియు బిజెపి టౌన్ యూత్ అధ్యక్షుడు మురళీకృష్ణ, టిడిపి నాయకుడు రాకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులతో కలసి ఆడంబరాలకు పరిమితం చేయకుండా అవసరం ఉన్నవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో సాలూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధులు,గర్భిణీ స్త్రీలు,చిన్నారులు,రోగులు కలిపి100 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ విధముగా పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ,మానవతా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు రేగు మహేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే పవన్ కళ్యాణ్ ఆశయమని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు సహాయం చేయడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. బిజెపి నాయకులు, కూటమి నాయకుల సమన్వయంతో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *