వైయస్సార్ సేవలు మరువలేనివి. మాజీమార్కెట్ , చైర్మన్ రంగా హనుమంతరావు

🖨️ Print

జనం న్యూస్ మధిర సెప్టెంబర్ 2 దోర్నాల కృష్ణ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు, మండల కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఛావా వేణు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రైల్వే గేట్ వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు రహీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ వర్ధంతి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై వైయస్సార్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *