రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కళింగ కోమట్లకు రిజర్వేషన్ కల్పించాలి.

*డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రేను కలిసిన రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ గోవిందరాజులు.

జనం న్యూస్ మే 2 కోటబొమ్మాళి మండలం :రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కళింగ కోమట్లను గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు కోరారు. ఆయన శనివారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో నివసిస్తున్న ప్రజలలో అత్యధికం సుమారు 80% మంది ప్రజలు బీసీలే. అయితే బీసీ రిజర్వేషన్ల ద్వారా అందుతున్న ఫలాలని కొన్ని కులాల వారే అనుభవిస్తున్నారన్నారు. కళింగవైశ్యులైన మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నామనీ. తలసరి ఆదాయం తక్కువగా ఉంటూ, కనీస సౌకర్యాలకు నోచుకోక జీవనం సాగిస్తున్న మాకు దామాషా ప్రకారం జన, కుల గణనల అనంతరము జరగబోవు స్థానిక ఎన్నికలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని పైకి తీసుకువస్తారని ఆశిస్తున్నామనీ ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే కళింగవైశ్యులకు చట్టసభలలో ఇప్పటివరకు స్థానం కూడా లభించలేదనీ. మా గళం వినిపించే అవకాశం కూడా మాకు రాలేదన్నారు.గతంలో అనగా 2014లో ఉత్తరాంధ్రలో ఉమ్మడి మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న కళింగవైష్యులను బీ.సీలుగా గుర్తిస్తూ జీవో నెంబర్ 10ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిందనీ, ఆ జీవో ఆధారంగా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలలో బీ.సీ కుల ధ్రువపత్రాలు పొందుతున్నామనీ, కానీ బ్రతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఉత్తరాంధ్ర వెలుపలకు పోయి రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో నివసిస్తున్న వాళ్లకి బీ.సీ వర్తించకపోవడంతో వారు విద్య, వైద్యానికి నోచుకోక, రిజర్వేషన్ల ఫలాలు అందుకోలేక నానా అగచాట్లు పడుచున్నారనీ వివరించారు. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళింగ వైశ్యులకి బి.సి హూదా కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం జీవో, నెంబర్ 25 జారీ చేసింది కానీ గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అమలు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా కళింగవైశ్యులు విద్యా, వైద్య,రాజకీయ రంగాలలో అవకాశాలను కోల్పోతున్నారన్నారు. ఈ సమస్యను కూడా తమరు సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తారని ఆశిస్తున్నామనీ కోరారు.కళింగ వైశ్యులను ఓ.బి.సి జాబితాులో చేర్చడానికి విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీ.సి మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో సెప్టెంబర్ 2023లో ఎన్సీబీసీ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కూడా నిర్వహించడం జరిగిందన్నారు. కనుక మా దుర్భర పరిస్థితులను తమరు గ్రహించి కళింగవైశ్యులని ఓ.బీ.సీ జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వానికి నివేదించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *