శ్రీ వరదరాజ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుడ్డా…

జనం న్యూస్ 2 జూలై 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని పెద్దదేవలాపురం గ్రామం లో శ్రీ వరదరాజ స్వామి ధ్వజస్తంభ ఆలయ ప్రతిష్ట 10-7-2026 నుండి 12-7-2026 మూడు రోజులపాటు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట ధ్వజ స్తంభము మహోత్సవ కార్యక్రమం జరుగునని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏ నాగప్రసాద్ గురువారం నాడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని ఆహ్వానించారు. వేల్పనూరు గ్రామం స్వగ్రామమైన తన నివాసములో ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగప్రసాద్, టిడిపి నాయకులు కృష్ణారెడ్డి, డిష్ రామలింగం, ప్రసాదు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *