జనం న్యూస్, జూలై 2 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్,) రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి విద్యుత్ కార్యాలయంలో రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరుస్తూ, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అందించే చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, వేగవంతమైన మరమ్మతు సేవలు, వ్యవసాయానికి అనుకూల మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, ఏఈ కృష్ణ శ్రీనివాస్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలచెరువు చంద్ర, గోరంట్ల టౌన్ 6 మ్యాన్ కమిటీ సభ్యులు , బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు సంతోష్, ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవరకొండ ఉమాశంకర్, మాజీ సర్పంచ్ ఉత్తమరెడ్డి శ్రీకాంత్, సుభాహన్, గాజుల రమేష్, మహేంద్ర, గంగిరెడ్డి, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.