నేడే జాతీయ పల్స్ పోలియో..పల్స్ పోలియో గురించి అవగాహన ర్యాలీ-: వైద్య అధికారి వి లిఖిత

జనం న్యూస్ 27/6/2026 బలిజిపేట ప్రతినిధి పి జయరాం -: స్థానిక బస్టాండ్ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి వి. లిఖిత ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ పల్స్ పోలియో సందర్భంగా నేడు పల్స్ పోలియో ఐదు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు తప్పకుండా పోలియో వ్యాధి నివారణ కోసం పోలియో 2 చుక్కలు వేయించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయలు మరియు సిబ్బంది విద్యార్థులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *