జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు దివంగత పీవీ చలపతి రావు జయంతి వేడుకలు అమలాపురం లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల బాషా, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, కార్యాలయ ఇన్చార్జ్ డీవీఎస్ రాజు, మన్నే రామదాసు తదితరులు పాల్గొన్నారు.