బిఎల్ఎలు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలి

జనం న్యూస్ 25 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ -జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
పోలింగ్ స్టేషన్ల వారీగా నియమింపబడ్డ బిఎల్ఏలు ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ గా బిఎల్వోలకు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటింటి సర్వే చేస్తున్న నేపథ్యంలో గురువారం గద్వాలలోని 26వ వార్డు గంట వీధి పోలింగ్ బూత్ 264 కు సంబంధించి బూత్ లెవెల్ అధికారులు చేస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిఎల్వోలు తమ పరిధిలోనీ ప్రతి ఇంటికి ఎన్నిమరేషన్ ఫారాలను అందజేసి, నిర్దేశిత అంశాలన్నింటినీ ఓటర్లు పూరించి ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. రోజువారి వివరాలను బిఎల్ఓలు ఎప్పటికప్పుడు సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే సందర్భంగా బిఎల్ఓ లతోపాటు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు ఓటర్లతో మాట్లాడారు. కాలనీ వాసులు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, ఎన్నికల ఉప తహసిల్దారు ఉదయ్ కిరణ్, ఆర్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, సూపర్వైజర్ నాగేంద్రమ్మ, బిఎల్ఓ శ్రీలత, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *