వివేకానంద విద్యాపీఠ్ పాఠశాలలో ఘనంగా పది పరీక్షల ఫలితాల సంబరాలు

జనం న్యూస్ మే 03 మేడిపల్లి మండలం: ఉప్పల్ లోని వివేకానంద విద్యాపీఠ్ పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రతిభావంతమైన ఫలితాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. ఈ ఫలితాలలో సయ్యదా ఆమేనా 582/600 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, ఎం. అభిగ్నా 567/600 మార్కులతో ద్వితీయ స్థానం, వై. వైష్ణవి 561/600 మార్కులతో తృతీయ స్థానం పొందారు. అదేవిధంగా, మొత్తం 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ శ్రీ సుధాకర్ కొడూరి మరియు ఛైర్మన్ శ్రీమతి ఉషా కొడూరి టాపర్లను శాలువా మరియు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుధాకర్ కొడూరి మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి ముఖ్య కారణమని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాలతో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *