ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన రాబందులు

జనం న్యూస్ 02 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మండల అధికారుల సహకారంతోనే ఇలా జరుగుతుందన్న గ్రామ ప్రజలు. జిల్లా కలెక్టర్ తమ దృష్టికి తీసుకొని ప్రభుత్వ స్థలాలను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలోని ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన రాబందులు. లక్షలు,కోట్లు విలువ చేసే భూములపై అధికార రాబందులు మండల స్థాయి అధికారుల అండదండల సహకారంతో.. మూడు ఆరు నెలల కి ఒక సారి ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.1978 లో అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇది మా భూమి అని,మండల. అధికారుల,రాజకీయ అండదండల సహకారంతో.. అలాగే ప్రస్తుత పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం అండదండలు ఉండడంతో మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ఆలోచనతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు.ఏమి జరిగినా అంతా మా లీడర్ చూసుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఇలా జరుగుతుంది.ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ, అధికారులదే అయినప్పటికీ.. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాదీనం చేసుకొని లక్షలు, కోట్లు సంపాదించుకోవడానికి కొందరి రాబందులు అనే మనసులు ఈ ఘాతుకానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే.. ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన రాబందులకే కట్టబెడతారా లేక రక్షిస్తారా వేచి చూద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *