గ్రంథాలయ శాఖలోవేసవి విజ్ఞాన శిబిరం

జనం న్యూస్, మే 2 తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం ముక్కామల గ్రంధాలయ శాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించారు. ముందుగా మహా విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు 116వ జయంతిని నిర్వహించారు. అనంతరం రిసోర్స్ పర్సన్ ఎన్ పుష్పవతి విద్యార్థులు అందరితో పుస్తక పఠనం చేయించారు. విద్యార్థులతో కథలు చదివించడం ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం నేర్పించారు. విద్యార్థులకు సత్పవర్తన గురించి చెడు అలవాట్లు ఎలా మానాలి అన్న అంశాల గురించి కాన్వెంట్ ఉపాధ్యాయురాలు ఎన్ సత్యవతి వివరించారు . అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కరుటూరి విశ్వనాథం విద్యార్థులకు చురుకుదనం పెరిగే విధంగా యోగా చేయించడం జరిగింది క్యారమ్స్ వంటి ఆటలు ఆడించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *