అనంత రాములమ్మ వారి మృతికి కాంగ్రెస్ నాయకుల ప్రగాఢ సంతాపం

🖨️ Print

జనం న్యూస్ మధిర, సెప్టెంబర్ 2 దోర్నాల కృష్ణ మధిర 21వ డివిజన్‌కు చెందిన అనంత శివరామకృష్ణ వారి మాతృమూర్తి అనంత రాములమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మధిర టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు వారి నివాసానికి చేరుకొని, అనంత రాములమ్మ భౌతిక గాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అనంత శివరామకృష్ణ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంత రాములమ్మ మరణం ఎంతో బాధాకరమని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.అదేవిధంగా మధిర 21వ డివిజన్ కౌన్సిలర్ శ్రీ రంగా రూప శ్రీనివాస్ వారు కూడా అనంత రాములమ్మ భౌతిక గాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాదకర సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యర్రగుంట కమలాకర్, నల్లబోతుల నరసింహారావు, కాంగ్రెస్ యువజన నాయకులు సాలిక సురేష్, గోపి* తదితరులు పాల్గొని, అనంత రాములమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.అనంత రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కాంగ్రెస్ నాయకులు ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *