జనం న్యూస్ మే 2/2026/కల్వకుర్తి :- అమరవాది ప్రమాణ స్వీకార సభ కాస్తా ఆంధ్రా నాయకుల సభగా మిగిలిపోయింది. తెలంగాణ ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు మూకుమ్మడిగా బహిష్కరించడంతో అమరావాది వర్గం పరువు బజారున పడిందని మిడిదుడ్డి శ్యాంసుందర్ విమర్శించారు. తెలంగాణ నాయకుల పూర్తి బహిష్కారం నేడు జరిగిన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారాపు దయానంద్, ఎమ్మెల్యే దన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుజాత, మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ తదితర తెలంగాణ ప్రముఖులెవ్వరూ హాజరుకాలేదు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ “అక్రమ ఎన్నిక గెలుపు”ను సమ్మతించక బహిష్కరించడం గమనార్హం. అని ఆయన అన్నారు. అమరవాది కి”ఆంధ్రానే దిక్కు” అయ్యిందని – శ్యామ్ సుందర్ ధ్వజం ఎత్తారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా మండిపడ్డారు.”11 ఏండ్లుగా అప్రజాస్వామికంగా ఉన్న అమరావతి వర్గానికి తెలంగాణ ఆర్యవైశ్యులు బుద్ధి చెప్పారు. నిన్నటిదాకా ‘బయటి రాష్ట్రం’ అంటూ ఆంధ్రాను సంబోధించిన వారే, నేడు టీజీ వెంకటేష్, కనక రాజు లాంటి ఆంధ్రా నాయకులే దిక్కయ్యారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు.
శ్రీశైలం సత్రం విమర్శ మరిచారా అని ఆయన సూటి ప్రశ్న వేశారు.గతంలో శ్రీశైలం సత్రంలో టీజీ పేరు పెడితే ‘తెలంగాణ వారు లేరా’ అని విమర్శించిన అమరవాది, ఇప్పుడు తనకు ఆంధ్రా వారే దిక్కు కావడం ఏవిధంగా సమర్థించుకుంటారు? అప్పుడు ప్రాంతీయవాదం, ఇప్పుడు ఆంధ్రా వాదమా? ఆయన వైఖరి ఏమిటో తెలంగాణ ఆర్యవైశ్య సమాజానికి తెలియజేయాలి” అని శ్యామ్ సుందర్ నిలదీశారు. “2-3 ఓట్ల గెలుపు గెలుపు కాదు” “స్వచ్ఛమైన నీతి నిజాయితీ ఓట్లు నాకు 520 వచ్చాయి. డబ్బు, అంగబలం, అధికారం ఉపయోగించి సాంకేతికంగా 2-3 ఓట్లతో గెలిచామనుకోవడం భ్రమ. సమాన ఓట్లు వచ్చాయంటేనే జనవ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోండి” అని శ్యామ్ సుందర్ స్పష్టం చేశారు. “కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం” కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో సభ జరిపి ప్రమాణ స్వీకారం చేసుకోవడం విఫల ప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. “అక్రమ పదవి శాశ్వతం కాదు. ఉప్పల్‌లో కానీ మహాసభలో కానీ అన్యాయం జరిగితే పోరాటం తప్పదు. అక్రమాలపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా బుద్ధి చెబుతాం” అని హెచ్చరించారు. “పదవులు, బానిసత్వం, గులాంగిరి, వ్యాపారం కోసం కొందరు ఉండవచ్చు. కానీ ఆత్మాభిమానం, పౌరుషం, న్యాయం, ధర్మం ఉన్న ఆర్యవైశ్య జాతి ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. అవసరమైతే మన సత్తా, బలం, బలగం, పోరాటం చూపిస్తాం. వేచి చూద్దాం” అని పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు పూర్తిగా దూరం పెట్టడంతో అమరవాది వర్గం ఏకాకి అయ్యింది. “తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ” పేరు పెట్టుకుని ఆంధ్రా వారితో సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని సామాజిక వర్గం చర్చించుకుంటోంది.