జనం న్యూస్ మే 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2026 టెన్త్ క్లాస్ పరీక్షలలో అనకాపల్లి జిల్లా నుండి 10,369 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,142 మంది ఉత్తీర్ణులయ్యారని, జిల్లావ్యాప్తంగా బాలికలు 10208 హాజరు కాగా,9,450 మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, పాస్ పర్సంటేజ్ 90.54 శాతం నమోద కావడం, విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ, మార్గదర్శకలు ఉత్తమ ఫలితాలు తగ్గడానికి, ఆయన కృషి హర్షనీయమని మాజీ శాసన మండల సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు విలేకరుల సమావేశంలో లోకేష్ ని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఉపాధ్యాయులకు యాప్ ల గోల నుంచి విముక్తం కలిగించి విద్యార్థులకు బోధన వసతుల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉపాధ్యాయులు కార్పొరేటు రంగానికి దీటుగా బోధనలు చేయడం ఈ విద్యా సంవత్సరంలో కార్పొరేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత సాధించడంలో లోకేష్ కృషిని మరిచిపోలేమని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో అత్యధిక 96.04 ఉత్తీర్ణత నమోద కావడం, గతం కన్నా మిన్నగా ఉపాధ్యాయులు కృషి ప్రభుత్వం వంద రోజులు కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల పట్ల బాధ్యతలు తీసుకొని బోధన చేయడం వల్ల చక్కని మెలికవులు చెప్పడంతో ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందని నాగ జగదీష్ అన్నారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 96.04, బీసీ సంక్షేమ 96.02, ఆదర్శ పాఠశాలలో 89.50 సాంఘిక సంక్షేమం 89 శాతం, ఆశ్రమ పాఠశాలలో 70.09, కేజీబీవీ 88.81, గిరిజన సంక్షేమం 75.05 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలో 78.09 శాతం, ఎయిడెడ్ పాఠశాలలో 76.55, పురపాలక పాఠశాలలో 72.02, ప్రభుత్వ బడుల్లో 69.63 శాతం మొత్తం యావరేజ్ గా 95.29 శాతం పాస్ అవడం ముమ్మాటికి విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారి యంత్రాంగం సమిష్ఠ కృషి ఫలితంగా విద్యార్థులలో పట్టుదల కారణంగా ఈ ఉత్తీర్ణతలు సాధించారని నాగ జగదీష్ అన్నారు. శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ విశ్రాంతి ఉపాధ్యాయులు కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా మంచి మన్యం జిల్లాలో ప్రతి పాఠశాలలో విద్యార్థులను ఏ బి సి డి గా విభజించి ప్రతివారం పరీక్షల నిర్వహించి, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, 100 రోజుల కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన వంద రోజులు ప్రణాళికను పక్కాగా అమలు చేశారని, రైజింగ్, సైనింగ్ స్టార్ పై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించారని, పదో తరగతి పరీక్షల ఫలితాల్లో నాలుగేళ్లుగా మన్యం జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం గర్వకారణమని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కాండ్రేగుల రవీంద్ర పాల్గొన్నారు.