మండుతున్న ఎండల్లో మానవత్వం చాటిన దాతలు

జనం న్యూస్ మే 3(రిపోర్టర్ రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం హోతురు గ్రామంలో శనివారం ఉరవకొండ నివాసి సామాజిక కార్యకర్త చింతగింజల కేశవ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త చింతగింజల కేశవ మాట్లాడుతూ వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం చడం జరుగుతుందని,ఈ కార్యక్రమం ప్రధాన రహదారులు,బస్టాండులు, మార్కెట్ ప్రాంతాల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి రాధాచారులకు, కార్మికులకు,వాహనదారులకు మజ్జిగ అందించడం జరుగుతుందన్నారు,ఈ కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్న వరకు కొనసాగగా వందలాదిమంది లబ్ధి పొందారు, ప్రత్యేకంగా ఎండలో పనిచేసే కార్మికులు,రిక్షా డ్రైవర్లు,వృద్ధులు ఈ సేవను ఎంతో ఉపయుక్తంగా భావించారు,అంతేకాక శిబిరంలో శుభ్రత పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛమైన నీటితో మజ్జిగ తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది అన్నారు,ఈ కార్యక్రమంలో సాయి శ్రీ కావ్య,ఆశా వర్కర్లు వాణి, నాగేంద్రమ్మ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *