సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి- సీఐ వై సతీష్

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 చిట్యాల మండల ప్రతినిధి జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా చిట్యాల సిఐ వై. సతీష్ పాల్గొని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ఎస్సై 2 రాజన్ కుమార్ ల తో కలిసి విద్యార్థులకు సైబర్ భద్రతపై నిర్దేశం చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న అత్యాధునిక సైబర్ మూసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారిని కూడా చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్ అధికారుల పేరుతో వీడియో కాల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేసే ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా ఫేక్ పార్ట్ టైం జాబ్స్ అండ్ టాస్క్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ అండ్ డిఫ్ఫేక్ వంటి సైబర్ మోసాల పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించాలని అదేవిధంగా సోషల్ మీడియా వంటి సామాజిక మాధ్యమాలకు మితిమీరి మైనర్లు వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు మోసాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు డయల్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవిఎస్సై 2 రాజన్ కుమార్ అధ్యాపక బృందం పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *