
జనం న్యూస్ సెప్టెంబర్2మండలం పెన్పహాడ్ :వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి వంగడాలను సాగు చేసి రైతులు 500 రూపాయలు బోనస్ పొందాలని మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. బిపిటి 5204, కె ఎన్ ఎం 1638, తెలంగాణ సోనా, హేచ్ ఎం టి, జె ఎస్ ఆర్, డబ్ల్యూ జి ఎల్ 44, కె ఎన్ ఎం 7715 వరి వంగడాలు సాగు చేస్తేనే క్విం టాలుకు రూ.500 రైతులు బోనస్ పొందగ లరని చెప్పారు.ఈ 7 రకాలు సాగు చేసిన రైతులు టీ అగ్రిఫీల్ పోర్టల్లో సెప్టెంబర్ 10లోగా నమోదు చేసుకోవాలని కోరారు. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతు లు పట్టాదారు పాసుబుక్, విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లు తీసుకొని డీలర్ వద్దనే సాగు వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. సొంత విత్తనాలు, ఇతర రైతులు వద్ద విత్తనాలు కొని సాగు చేసుకున్న రైతులు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించి ఏ ఈ ఓ ల వద్ద నమోదు చేసుకో వాలన్నారు. నిర్ణీత గడువులో నమోదు చేసు కుని ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ పొందాలన్నారు.