కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

🖨️ Print

జనం న్యూస్ , సెప్టెంబర్ 2 , బోధన్ నియోజవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అమలు చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు . బుధవారం రోజున బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వీజీ గౌడ్ బోధన్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారం రోజులు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు . టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2000 రూపాయలు పించెను రైతులకు గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ప్రతి ఒక్కరిని కులమత బేధాలు లేకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లామని గుర్తు చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఈరోజు దోచుకుంటే లిక్కర్ స్కాములు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మహిళలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చి ఒక్కొక్క 82, వేల 500 మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు మరియు బీడీ కార్మికులకు 4000 రూపాయలు ఇస్తామని , వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని తులం బంగారం , రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ , అనంతరం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులందరూ వచ్చి పాల్గొని సమస్యల కోసం పోరాడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేసుకోవాలంటే రైతులు ఇబ్బందులు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక తక్కువ ధరకే అమ్ముకున్నారని అన్నారు . కార్యక్రమంలో బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ , సీనియర్ నాయకులు గిద్ద వారి గంగారెడ్డి , అశోక్ రెడ్డి బిఆర్ ఎస్ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *