మఠంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 3( మఠంపల్లి ప్రతినిధి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి వ్యవసాయ కూలీలకు వెంటనే పనులు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో సరైన ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఉపాధి హామీ పథకం కింద పనులను గుర్తించి నిరంతరం పని కల్పించాలని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కూలీలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *