డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గోరంట్లలో భారీ బైక్ ర్యాలీ

--డీజే వాహనంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించిన జనసేన శ్రేణులు
🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్02 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో జనసేన పార్టీ శ్రేణులు బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మండలంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డీజే వాహనంతో ఉత్సాహభరిత వాతావరణంలో బైక్ ర్యాలీ కొనసాగింది. జనసేన జెండాలను చేతబట్టి ద్విచక్ర వాహనాలపై పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి సురేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి సి. వెంకటేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, మండల అధ్యక్షులు ఎం. సంతోష్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్, వానవోలు సింగిల్ విండో డైరెక్టర్ నాగేష్, బూదిలి సింగిల్ విండో డైరెక్టర్ నవీన్ కుమార్, నియోజకవర్గ నాయకులు అనిల్, మండల నాయకులు రాఘవేంద్ర, శ్రీనివాసులు, గాజుల రమేష్, గోవిందప్ప, నాగేంద్ర, గంగంపల్లి రమణ, సింగిరెడ్డిపల్లి రమేష్, కమ్మలవాండ్లపల్లె రాజు, నరేష్, సురేష్, సాయి, సుదర్శన్, హేమంత్, రెడ్డప్ప, మందలపల్లి రామంజి, శంకర, వీర మహిళ కావేరి, దేవల్ చెరువు రమేష్, పులి అనిల్, పెరుమాలపల్లె అనిల్ కుమార్ యాదవ్, రాజీవ్ కాలనీ బాలు, రమేష్, మూర్తి, చిన్న, లవ్ కుమార్, నాగేంద్ర, పవర్ స్టార్ బాబా, పవన్ కళ్యాణ్, మధు తదితరులతో పాటు ఆయా పంచాయతీల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *