
జనం న్యూస్ సెప్టెంబర్ 2 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్)నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఖానాపూర్ మండలంలోని బావాపూర్ (కే) గ్రామ సర్పంచ్ మైస రాజేశ్వర్ ఖానాపూర్ పట్టణంలోని భూక్యా జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చేతుల మీదుగా బీ.ఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా భూక్య జాన్సన్ నాయక్ మైస రాజేశ్వర్ కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో ఆయన చేరికతో పాటు, పలువురు గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.