స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసిన సర్పంచ్ ప్ర‌వీణ్

🖨️ Print

జనంన్యూస్ సెప్టెంబర్ 04 ఎలిగేడు ,మండలం బుధవారము రోజున మండల కేంద్రములో ,ఎలిగేడు గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ ఆధ్వర్యములో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రజలకు ప్రభుత్వ రేషన్ సదుపాయాలు మరింత సులభంగా ,పారదర్శకంగా అందుబాటులోకి రానున్నాయి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే విధంగా కృషి చేస్తామని సర్పంచ్ కప్పల ప్రవీణ్ తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సేవలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ కప్పల ప్రవీణ్ ,ఉప సర్పంచ్ నరేష్ ,గ్రామ కార్యదర్శి అంజలి ,వార్డు సభ్యులు , ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *