పంట దిగుబడి అంచనాకు పంట కోత ప్రయోగాలే కీలకం: ఏవో మధుకర్

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 3 (ప్రతినిధి రాజు): అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో బుధవారం 2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పంట కోత ప్రయోగాలపై రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మధుకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ గణాంక అధికారి పర్వతప్ప పాల్గొని సిబ్బందికి పంట కోత ప్రయోగాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పంట కోత ప్రయోగాల ద్వారా గ్రామస్థాయిలోనే పంట దిగుబడిని జీవిఏ నిర్ధారించేందుకు వీలవుతుందని, అనంతరం జాతీయస్థాయిలో దిగుబడి అంచనాలకు ఈ గణాంకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు పంట కోత ప్రయోగాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ప్రయోగాలను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ జోష్ణ, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *