
జనం న్యూస్ సెప్టెంబర్ 2 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్)నిర్మల్ జిల్లాఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో బుధవారం ఖానాపూర్ పట్టణంలో భారీ ర్యాలీనిర్వహించారు.పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల పరిస్థితి ఏంటి?అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే మా ఉద్దేశం” అని అన్నారు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ ప్రజలకు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 1000 రోజులు, 33 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని, 33 నెలలు గడిచినా మహిళలకు ఇవ్వాల్సిన రూ.2,500 ఎక్కడ?అని ప్రశ్నించారు. వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు నెలకు రూ.6,000 ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, తమ ఆడబిడ్డల వివాహాల కోసం పేద కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూశాయని అన్నారు. ఆ హామీ ఏమైందో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఖానాపూర్నియోజకవర్గంలోని వేలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని జాన్సన్ నాయక్ గారు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రభుత్వంచెప్పాలనిడిమాండ్ చేశారు.రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్ వంటి హామీలు ఇచ్చారని, కానీ రైతులు నేటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగినపరిస్థితుల్లో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు కూలీలు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ బాకీ కార్డులు ఎవరిమీదవ్యక్తిగత విమర్శలు చేయడానికి తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి, ప్రజలకు రావాల్సిన హక్కులను ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేయడానికి తీసుకొచ్చాం అని జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీ ఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది” అని *భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.ఈ భారీ ర్యాలీలో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు,యువత,విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._