చేనేతల ఇంటింటా ఉచిత కాంతులు

*నేతన్నలకు ఏడాది ఉపాధి భరోసా!

జనంన్యూస్ : గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది.మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తోంది.జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులు రావడంతో, చేనేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ట్రాన్స్ అధికారులు చెబుతుండడంతో వారంతా మురిసిపోతున్నారు’అని మంత్రి సవిత స్పష్టం చేశారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీ నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులో భాగంగా తొలి నెలలో జీరో పేమెంట్ విద్యుత్ బిల్లు రావడంతో చేనేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు’అని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా లక్షా నాలుగు వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందజేసేలా చర్యలు చేపట్టింది’అని మంత్రి సవిత గుర్తు చేశారు. నూలుపై 15శాతం సబ్సిడీ అందజేత మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని దాని మేరకు ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది అని చెప్పుకొచ్చారు. ఒకవైపు చేనేత రంగ అభివృద్ధికి ప్రణాళికలు అమలుచేస్తూనే…నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా పథకాలు అమలు చేస్తోంది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అంద జేస్తోంది. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తోంది. నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోంది. ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తోంది. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందచేసింది’అని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. ‘గత నెల ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రావడంతో, గడిచిన రెండ్రోజుల నుంచి గ్రామాల్లో చేనేతలకు విద్యుత్ బిల్లులను ట్రాన్స్ కో అధికారులు అందజేస్తూ వస్తున్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులు రావడంతో, చేనేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ట్రాన్స్ అధికారులు చెబుతుండడంతో వారంతా మురిసిపోతున్నారు’అని మంత్రి సవిత స్పష్టం చేశారు. ‘చేనేత, విద్యుత్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ నేతన్నల ఉచిత విద్యుత్ పథకం విజయవంతానికి తమ వంతు పాత్ర పోషించారు. రాష్ట్రంలో 50,252 మగ్గం నేతన్నల కుటుంబాలను, 6,995 మరమగ్గం మీద నేసే కుటుంబాలను ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులుగా గుర్తించారు. వారికి ఉచిత విద్యుత్ సరాఫరా చేశారు. మిగిలిన అర్హులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తించేలా కృషి చేస్తున్నారు’అని మంత్రి సవిత పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ తో ఆర్థిక భరోసా ‘ఉచిత విద్యుత్ తో మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, సంవత్సరానికి రూ.8,640లు లబ్ధి కలుగనుంది. మరమగ్గం మీద నేసే కుటుంబానికి నెలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి కలుగనుంది. ఉచిత విద్యుత్ రూపంలో నెల నెలా ఆర్థిక భారం తప్పిందని, తమకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినమాటకు కట్టుబడుతూ, ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, కూటమి ప్రభుత్వానికి చేనేతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు’అని మంత్రి సవిత పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *