జమ్మికుంటలో వాహనాలు, లాడ్జిలపై పోలీసుల తనిఖీలు

జనం న్యూస్, మే 2 ( జిల్లా ఇంచార్జ్ ) హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణ సిఐతో పాటు పోలీసు సిబ్బంది కలిసి ముఖ్య ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి విచారణ చేశారు.అలాగే జమ్మికుంటలోని వివిధ లాడ్జిలలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అతిథుల వివరాలను నమోదు చేసుకున్న విధానం, గుర్తింపు పత్రాలు వంటి అంశాలను పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు తరచూ కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *