జనం న్యూస్ మే 0 2 మణుగూరు రూరల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుర్గంధం వెదజల్లుతున్న రాజీవ్ గాంధీ నగర్ జ్వరాల బారిన పడుతున్న ప్రజలు అస్తవ్యస్తంగా సమితి సింగారం పంచాయతీ మణుగూరు పేరులో మాత్రమే సమితి సింగారం పంచాయతీ.పంచాయతీలో ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోందని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.పంచాయతీలోని అనేక వార్డుల్లో కాలువలను శుభ్రం చేయక పోవడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగి జనాలు జ్వరాల బారిన పడుతున్నాప్పటికీ పంచాయతీ పాలకులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని పంచాయతీ సెక్రటరీపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనారోగ్యంతో బాధలు పడుతున్నా…కార్యదర్శి,అధికారులు ఏ మాత్రం “మొద్దు నిద్ర”లో ఉన్నారంటూ మండిపడు తున్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ నగర్ లోని కాల్వలు మురికి కూపాలుగా మారాయని. ఇళ్ల ముందున్న డ్రైనేజీ లోని మురికి నీరు తీయక పోవడం వల్ల ఇళ్ల ముందు చేరుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ కార్యదర్శిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం రేణుక అక్షర మహిళా మండలి సమితి సింగారం పంచాయితీలోని రాజీవ్ గాంధీ నగర్ లో పారిశుద్ధ్యం లోపించడంతో రేణుక అక్షర మహిళా మండలి ఘాటుగా స్పందించింది.పంచాయితీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. చర్యలు తీసుకోకపోతే గ్రామ ప్రజలతో కలిసి పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ సభ్యులు ఎండి షబానా కోరి శ్యామల, కన్నాపురం వసంత, రెడ్డిబోయిన రేణుక, డేరంగుల సుజాత,కన్నాపురం శైలజ, బాడిష పార్వతి, సౌజన్య డాకూరి తదితరులు పాల్గొన్నారు.