జనం న్యూస్ 2 మే 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలోని సోమయాజుల పల్లె గ్రామంలో శనివారం నాడు ప్రమాదవశాత్తు వరిగడ్డి వామి దగ్ధమైంది.. గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణుడు అనే రైతు వామికి మంటలు చెలరేగి దగ్ధమైంది.స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. బాధితుడు సుమారు 35 వేల రూపాయల నష్టం వాటిలినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.. బాధితుడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.