రామచంద్రపురంలో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రామచంద్రపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు దునే శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమదు కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించడం, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో చర్చించారు.బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రతి బూత్‌లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా నాయకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేయడం వంటి పలు అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ ఇన్‌చార్జి అవసరాల రమణమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శులు మాధవబట్ల కృష్ణమూర్తి, కొప్పిశెట్టి శ్రీనివాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు, సీనియర్ నాయకులు యండ్ర బుల్లబ్బులు, కుప్పెల సూర్యనారాయణ, పట్టణ కిసాన్ మోర్చ అధ్యక్షులు ఖండవల్లి సత్యనారాయణ,స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ సలాది సతీష్ నాయుడు, అవసరాల నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *