
జనం న్యూస్ సెప్టెంబర్ 2, మసాయి పేట్ ప్రతినిధి మొహమ్మద్ ముజామిల్ , చేగుంట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి ఏడవ వర్ధంతిని సందర్బంగా కళాశాల విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ నిర్వహించారు. , ముందుగా ముత్యంరెడ్డి, చిత్రపటనికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… 2009లో ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల రోజుల్లోనే చేగుంటకు జూనియర్ కళాశాలను మంజూరు చేయించారని, నియోజకవర్గంలోని ఆరు జూనియర్ కళాశాలల్లో ఐదింటిని ఆయనే నెలకొల్పారని గుర్తుచేశారు. చేగుంటలో పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటులో ఆయన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఓటుకు నోటు సంస్కృతిని, అవినీతిని యువత చైతన్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దసరా లోపు కళాశాలకు సొంత ఖర్చులతో 10 కంప్యూటర్లను సమకూరుస్తానని, మైదానాన్ని పూర్తిస్థాయి స్టేడియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, ఓటములకు కుంగిపోకుండా లక్ష్యాలను సాధించాలని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సండ్రగు స్రవంతి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, శ్రీ శ్రీ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సండ్రుగు సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొజామిల్, స్టాలిన్, బాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రమోద్ కుమార్, లెక్చరర్లు నర్సింలు, ఫర్జానా బాలయ్య, విద్యార్థిని, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుకు శ్రీకాంత్, ప్రవీణ్, భాస్కర్, భాగ్యరాజ్, చేగుంట వార్డ్ మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.