పదవీవిరమణ అభినందన విద్యాసదస్సు

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2, భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్. మండల ప్రతినిధి మహాదేవపూర్ మాజీ మండల విద్యాధికారి, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల మహాదేవపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ బాల్నే ప్రకాష్ బాబు పదవీ విరమణ అభినందనసభలో భాగంగా నిర్వహించిన విద్యాసదస్సులో విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మినారాయణ ప్రభుత్వపాఠశాలలు ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో విద్యారంగం పెను సంక్షోభంలో ఉందని, దాంట్లో భాగంగానే విద్యార్థులు జంతర్ మంతర్ విద్యా ఉద్యమం లేవదీసి కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పుట్టించారని, వారి ఉద్యమం గమనించినప్పుడు విద్యారంగ సంస్కరణలే కాకుండా సమాజంలో సమన్యాయం కొరకు సమాన హక్కులు చెందాలని సమానత్వం సాధించాలని అనే లక్ష్యాలతో ఆ ఉద్యమం కనిపిస్తుందని మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో ప్రారంభమైనప్పటికీ దానిలో సమాజానికి సంబంధించిన సామాజిక అంశాల ఆలోచనలు ఎండి ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము పరోక్షంగా ఒకరికొకరు తోడుగా ఉంటూ విద్యారంగాన్ని ప్రైవేటుపరం చేయడంలో ఒక అవగాహనకు వచ్చే ముందుకు వెళుతున్నాయని పేర్కొన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. . ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల పని తీరును మరియు డిటిఎఫ్ మహాదేవపూర్ మండలశాఖను అభినందించారు. విద్యారంగంలో సంస్కరణలు నా వంతు బాధ్యత తీసుకొని మీకు ఉపయోగపడతానని పేర్కొన్నారు. ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ హసీనాబాను ప్రకాష్ బాబును శాలువాతో సన్మానించారు.రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ టి లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలు ఉంటేనే సమాజంలో చైతన్యం ఉన్నట్టని, చైతన్యం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం నడుస్తుందని ఇప్పటికే మూడు దశల ఉద్యమం పూర్తి అయిందని నాలుగో దశ ఉద్యమంగా రాష్ట్ర రాజధానిలో సెప్టెంబర్ 10 నాడు మహాధర్న ఉందని ఈ మహాధర్నలోపే ప్రభుత్వము స్పందించి మా వైపున ఉన్న డిమాండ్స్ ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధ్యాపకజ్వాల ప్రధాన సంపాదకులు గంగాధర్ ప్రభుత్వపాఠశాల లే రాబోయే కాలపు చైతన్య కేంద్రాలని అన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రకాష్ బాబును అభినందించారు. ఈ కార్యక్రమం డిటిఎఫ్ మండలశాఖ మహాదేవపూర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.మొదటి సమావేశానికి అధ్యక్షులుగా కొత్తపల్లి సారంగపాణి, అదే విధంగా రెండవ సమావేశానికి ప్రధాన కార్యదర్శి శ్రీ దామెరకుంట శ్రీకాంత్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సదస్సులో రాష్ట్ర కౌన్సిలర్స్ ప్రభాకర్ రెడ్డి, లక్ష్మన్ నాయక్, చేరి ప్రభాకర్, ఉపాధ్యక్షులు శ్రీ తిరుపతి రెడ్డి, డి టి ఎఫ్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు వీరేశం, మండల భాద్యులు గోనె సాయికుమార్, రెడ్డి మమత, శోభారాణి,సమ్మయ్య కవిత మరియు ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన డీటీఎఫ్ శ్రేణులు హాజరై సదస్సును విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *