కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 3, వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన బుధవారం రోజు మీడియాతో మాట్లాడుతు.ఎన్నికల సమయంలో ‘భట్టి’ మాటలు వింటే నిజమే అనిపించిందని, ప్రజలునమ్మి ఆరు గ్యారెంటీల కార్డులను జాగ్రత్తగా పెట్టెల్లో దాచుకున్నారని దాచుకున్నారని వ్యాఖ్యానించారు.100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, నేటికి 1000 రోజులు పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు.భట్టి మాటలన్నీ ఒట్టి మాటలయ్యాయి. హామీల కార్డ్ పట్టుకుని ప్రజలు రోడ్లపై ఎదురుచూస్తుంటే, నాయకులు ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు”అనితీవ్రవిమర్శలు చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *