కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు డౌనూరు చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 3 ( కొయ్యూరు రిపోర్టర్ సూపర్ స్టార్ కృష్ణ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బుధవారం రోజు డౌనూరు Check పోస్టు వద్ద కొయ్యురు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాసరావు పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ తదితర అంశాలను పరిశీలించారు.వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా, జాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.అదేవిధంగా, అక్రమ గంజాయి రవాణా, అక్రమ మద్యం తరలింపు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ప్రజల భద్రతను కాపాడటం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా వాహన తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *