రెవెన్యూ శాఖలో గోపాలకృష్ణ సేవలు అభినందనీయం

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం)మండలంలో రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో కొండపల్లి గోపాలకృష్ణ చేసిన సేవలు మరువలేనివని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపమ్మ పేర్కొన్నారు నడిగూడెం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిధులు నిర్వహించి పదవి విరమణ పొందిన గోపాలకృష్ణ వీడ్కోలు అభినందన సభ స్థానిక తహసిల్దార్ ఎల్. మంగా అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. పలువురు సర్పంచులు ప్రజాప్రతినిధులు విశ్రాంత ఉద్యోగులు గోపాలకృష్ణ సేవలను అభినందించారు. వీడ్కోలు సమావేశంలో మునగల తాసిల్దార్ సరిత మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్, నడిగూడెం, కాగిత రామచంద్రపురం పీఎస్సీ ఎస్ చైర్మన్లు కొల్లు రామారావు, సంధ్య లింగారెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బారాస, సిపిఎం పార్టీల బాధ్యులు బిక్షపతి, వీరబాబు నర్సిరెడ్డి, సత్యనారాయణ కేశవపురం, రత్నవరం సర్పంచ్లు గోసుల రాజేష్, దాట్ల నాగేశ్వరావు, విశ్రాంత తాసిల్దారులు జోసఫ్ బిక్షం రెవెన్యూ ఉద్యోగులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు పలు పార్టీల నాయకులు అభినందన సభలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *