గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి

జనం న్యూస్ మే 02 కోటబొమ్మాళి మండలం :గత ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా దుర్మార్గమైన, అవినీతి పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి, ప్రజల సమస్యలను విస్మరించిన పాలన సాగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రామాణిక అభివృద్ధి కార్యక్రమం కూడా అమలు కాలేదని, ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. 2014–2019 మధ్య కాలంలో వేసిన అభివృద్ధి బాటను పూర్తిగా అడ్డగించిన గత ప్రభుత్వం, అనంతర కాలంలో గ్రామాల పరిస్థితిని దయనీయంగా మార్చిందని అన్నారు. కనీస మౌలిక వసతులు అయిన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి అంశాలపైనా పట్టించుకోలేదని, గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేసే విధానాలతో కాలం గడిపిన ఆ పాలనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని, అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలు తిరస్కరించారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు, మామిడి రాము, పురుషోత్తం, జగదీశ్వరరావు, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *