4వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సమావేశం

★సమావేశం లో పాల్గొన్న 4వ వార్డ్ కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు

జనం న్యూస్ జులై 2 మంథని టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి)ఈ రోజు మంథని పట్టణంలోని 4వ వార్డు లైన్‌గడ్డ అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, గ్రామ పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు పాల్గొని చిన్నారుల పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, గుడ్లు, పాలను చిన్నారులకు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన చిన్నారులే సమాజానికి బలమైన భవిష్యత్తు అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ చంటమ్మ, ఆశా వర్కర్ అనురాధ,తల్లులు పాల్గొన్నారు.