జనం న్యూస్ మే 2 చిట్యాల మండల ప్రతినిధి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం తహసిల్దార్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసిల్దార్ ఎం అనిల్ హార్వెస్టర్ మిషన్ యజమానులతో మిషన్ నడిపే విధానం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో ముఖ్య అతిథిగా స్థానిక మండల ఎస్సై పి. సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హార్వెస్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి వరి కోత సమయంలో హార్వెస్టర్ మిషన్ ఆర్ పి యం. ను (18-20) మధ్యలో ఉంచాలని మిషన్ గేర్ పొజిషన్ ఏ నుండి భీ వరకు ఉండాలని మరియు ఫ్యాన్ సహాయంతో తాలు తీసుకొన వలసిందిగా పలు సూచనలు తెలుపుతూ వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశంలో జూకల్ ఏఈఓ దీపక్ తహసిల్దార్ఆఫీస్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ముబీస్ మరియు హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు.