సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ముఖ్య కార్యకర్తల డివిజన్ స్థాయి విస్తృత సమావేశం

★ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె గౌస్

జనం న్యూస్/జులై3/పోలవరం నియోజకవర్గం/రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ ఏలూరు జిల్లా,వేలేరుపాడు మండలం,చాగరపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ముఖ్య కార్యకర్తల డివిజన్ స్థాయి విస్తృత సమావేశం 200 మందితో కట్టం వీరాస్వామి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కే గౌస్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పదిమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్,ఎ.ఐ.యు.కె.ఎస్ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని దిగ్భ్రాంతిని తెలియజేస్తుంది. సుమారు 1500 నుండి 1600 సెల్సియస్ వేడి గల టన్నుల ఉక్కు ద్రవం మీద పడటంతో సజీవ దహనమయ్యారు. ఆరుగు కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కార్మికుల పట్ల యాజమాన్య భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేసిన యాజమాన్యం పై, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సిఎండి పై క్రిమినల్ కేసులు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన కార్మికులకు తక్షణ ఆర్థిక సహాయం కాకుండా, ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.జులై 3న వామపక్షాలు, కార్మిక సంఘాలు జరుపుతున్న ఆందోళన కార్యక్రమానికి మా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు, గడ్డల ముత్యాలరావు, పోలవరం పార్టీ డివిజన్ కార్యదర్శి కట్టం ముత్యాలరావు, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఎస్కే మున్ని, నార్లవరం మాజీ ఎంపీటీసీ కట్టం రత్తమ్మ, తిరుమలాపురం సర్పంచ్,ఉప సర్పంచ్ సోడే విజయ,వి బుచ్చయ్య,ఆసి పెద్ద,చిన్న లక్ష్మయ్యలు,వి రవి,రాముడు,మడకం నాగేశ్వరరావు చిచ్చుడి రాజులు టి సీత తదితరులు పాల్గొన్నారు.