సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కుక్కునూరు మండల కమిటీ సమావేశం

జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కుక్కునూరు మండల కమిటీ సమావేశం కుక్కునూరు మండలం కొత్త నెమలి పేటలో మడకం మల్లేష్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ, పోలవరం ముంపు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, జిల్లాలో, చింతూరు, వి ఆర్ పురం, కూనవరం, ఎటపాక, దేవీపట్నం మండలాలలో 18 సంవత్సరాల నిండిన యువతీ,యువకులకు 2022 కటీఫ్ తేదీగా సర్క్యులర్ జారీ చేసి పరిహారం పొందేందుకు ఆర్ అండ్ ఆర్ సభలు అధికారులు జరిపారని,అక్కడ నిర్వాసితులు నష్టపోతున్నట్లు ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాలలో ఇక్కడ కూడా వేలాదిమంది యువతీ..యువకులు ఆ సర్క్యులర్ ఇక్కడ అమలు చేయకపోవడం వలన తీవ్ర నష్టానికి గురి అవుతున్నారని,ఒకే రాష్ట్రంలో వేరు వేరు జిల్లాల్లో ప్రత్యేక జీవోలు సర్క్యులర్ లు ఉంటాయా,గత వైసిపి,కూటమి ప్రభుత్వాలు పోలవరం ముంపు నిర్వాసితులకు 2017 లో జీవో ఇచ్చి కాలయాపన చేస్తూ 8 సంవత్సరాల తర్వాత ఇటీవల ఆర్ అండ్ ఆర్ ఇచ్చినారని ఇంకనూ ఇవ్వాల్సి ఉందని, అన్ని రకాలుగా సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులను ఆర్థికంగా నష్టం చేశాయని, ఏలూరు జిల్లాలో యువతకు 2022 సర్క్యులర్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ, జూలై 6న సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాదిమందితో ధర్నా కార్యక్రమం ఉంటుందని , వేలేరుపాడు,కుక్కునూరు ,జీలుగుమిల్లి ,బుట్టాయిగూడెం,జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ల మండల కార్యాలయాల ముందు వందలాది మందితో యువతి,యువకులతో ఆందోళన కార్యక్రమం ఉంటుందని రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నిర్వాసిత యువతి, యువకులందరూ పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బి సత్యనారాయణ,కుక్కునూరు మండల పార్టీ కార్యదర్శి కంగాల కల్లయ్య, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఎస్కె మున్ని,డివిజన్, మండల నాయకులు మచ్చ ప్రశాంత్, సున్నం రాణి,మచ్చా ముత్తమ్మ, మడివి ఆదయ్య, మడివి ఉపేందర్, మడివి దేవయ్య, మడకం జోగయ్య, మడివి జోగయ్య తదితరులు పాల్గొన్నారు.