సస్యరక్షణ పద్ధతులు పాటించండి.

జనం న్యూస్ సెప్టెంబర్ 2 (టెక్కలి )కోటబొమ్మాళి మండలం :మండలంలో రైతులు ఈ ఖరీఫ్ కాలంలో వరిలో సస్యరక్షణ పద్ధతులను పాటించాలని స్థానిక వ్యవసాయ అధికారి సువ్వారి గోవిందరావు తెలిపారు. బుధవారం నాడు మండలం పెద్దబొమ్మడి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పంట పొలాన్ని పరిశీలించారు. ముఖ్యంగా దమ్ము చేసి ఉడిసిన వరి పిలక తొడిగే దశలో ఉందని, ఈ దశలో ఎకరాకు 20 కేజీల యూరియా, 20 కేజీల పో టాస్ చల్లుకోవాలి అన్నారు. ఈ దశలో లేత ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే ఎకరాకు 20 కేజీల జింక్ ను ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు. మరిన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. నీటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో వీ.ఎ.ఏ డి. ఝాన్సీ, గ్రామ రైతులు పాల్గొన్నారు.