జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 29 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. పీ.ఏ.పల్లి మండలం అంగడిపట సెంటర్ లో డివిజన్ 4 ఆఫీసు లో అధికారులు సమయ పాలన పాటించడం లేదు.రోజు వచ్చే సమయం కన్నా లేటుగా వస్తున్నారు. 10 గంటల సమయం కి వచ్చే అధికారులు 11:30 దాటిన రాలేదు. సమాచారం కోసం వచ్చే ప్రజలు చూసి వెళ్లిపోతున్నారు. చెరువులు కాలువలు కబ్జా చేస్తున్న పట్టించుకొని అలసత్వం వహించే అధికారులు కార్యాలయానికి వచ్చినా సమయము నిర్లక్ష్యం చేస్తున్నారని నిత్యం ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఫీల్డ్ విసిట్ వెళ్ళే తప్పుడు మినిట్ బుక్ లో రాసి వెళ్ళవలసిన అధికారులు వారు వచ్చిన సమయంలో రాసి వెళ్తున్నారు.అధికారుల కోసం వచ్చే ప్రజలు విస్తుపో తున్నారు. కాలువలు సమస్య ఉన్నవారు వచ్చి వెళ్లిపోతున్నారు. అధికారుల సమయ పాలన పాటించాలని ప్రజలు కోరుతున్నారు.